![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -145 లో .......లక్ష్మీ దగ్గరికి రుద్ర వచ్చి మందులు ఇస్తాడు. ప్రొద్దున పెద్దయ్య గారు వచ్చారు గంగ ని తీసుకొని వెళ్ళడానికి కానీ తను రానని చెప్పిందని లక్ష్మీ చెప్తుంది. మందులు వద్దని లక్ష్మీ అంటుంది. మీ అమ్మాయి మీకు మందులు కొనడం కోసం పని కోసం వెతుక్కుంటూ కష్టపడుతుంది. నేను తన గురించి అలోచించడం లేదు.. కేవలం మీ ఆరోగ్యం కోసం మాత్రమే ఆలోచిస్తున్నానని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తాడు.
అప్పుడే గంగ వస్తుంది. రుద్ర ఎదురుపడుతాడు. గంగ పడిపోతుంటే రుద్ర పట్టుకుంటాడు. ఇక గంగతో ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వెళ్లి రుద్ర సర్ ఎందుకు వచ్చాడని అడుగుతుంది. మందులు తీసుకొని వచ్చాడని లక్ష్మీ చెప్పాగానే డబ్బులు ఇస్తే తీసుకోలేదు అందుకే మందులు తీసుకొని వచ్చాడేమో మందులు ఇచ్చేసి వస్తానని గంగ అనగానే.. మొండి మొగుడు పెంకి పెళ్ళాం అసలు వినరని లక్ష్మీ అనుకుంటుంది. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ కి వీరు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. పారు కూడా వస్తుంది. అందరు ఉన్నారు గంగ ఉంటే బాగుండేదని పెద్దసారు అనగానే ఆ గంగ గురించి మాట్లాడొద్దన్నాను కదా అని శకుంతల కోప్పడుతుంది.
మరొక వైపు రుద్ర వచ్చి ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకుంటాడు. ఫుడ్ ఫెస్టివల్ కి గంగ, శ్రీను మారు వేషంలో వస్తారు. గంగ కర్చీఫ్ కింద పడేసినట్లు చేసి పెద్దసారు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. గంగ మారువేషం లో వచ్చిన విషయం ఇషిక, వీరు, పారుకి అర్థం అవుతుంది. గంగని చూసి ఎవరు మీరు అని శకుంతల అడుగుతుంది. వంటలు చెయ్యడానికి వచ్చామని గంగ చెప్తుంది. మరి ఆ ముసుగు ఏంటని శకుంతల అనగానే.. నా చెల్లికి పెళ్లి అయింది.. మూడు నెలలు వరకు ఎవరికి మొహం చూపించకూడదని శ్రీను అంటాడు. ఇక్కడికి పెద్ద పెద్దోళ్ళు వస్తారు అలా ఉండొద్దని శకుంతల అనగానే వదిలేయండి ఆంటీ వాళ్ళ ఆచారం అంట అని పారు అంటుంది. ఆ తర్వాత రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |